కంభం చెరువుకు పోటెత్తిన వరద

|

Sep 28, 2020 | 8:41 PM

ప్రకాశం జిల్లా కంభం చెరువుకు వరదనీరు పోటెత్తింది. ఎడతెరిపిలేని వర్షాలకు వరద నీరుగా భారీగా వచ్చి చేరడంతో నిండుకుండలా తొణికిసలాడుతోంది. పెద్ద తూము వద్ద 18 అడుగుల నీటి మట్టం నమోదయింది. 21 అడుగుల మేర నీరు చేరితే కంభం చెరువు అలుగు పారుతుంది.

కంభం చెరువుకు పోటెత్తిన వరద
Follow us on

ప్రకాశం జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి సగిలేరు వాగు పొంగి పొర్లుతోంది. పర్చూరు సబ్ డివిజన్ పరిధిలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి.

భారీ వర్షాలతో గుంటూరు జిల్లా తడిసిముద్దయింది. రొంపిచర్ల మండలం మునమాక, తుంగపడు దగ్గర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక ప్రకాశం జిల్లా కంభం చెరువుకు వరదనీరు పోటెత్తింది. ఎడతెరిపిలేని వర్షాలకు వరద నీరుగా భారీగా వచ్చి చేరడంతో నిండుకుండలా తొణికిసలాడుతోంది. పెద్ద తూము వద్ద 18 అడుగుల నీటి మట్టం నమోదయింది. 21 అడుగుల మేర నీరు చేరితే కంభం చెరువు అలుగు పారుతుంది.

గత మూడేళ్ళుగా అలుగుపారిన దాఖలాలు లేవు. మూడు రోజులుగా నల్లమల అటవీప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు పెద్ద ఎత్తున కంభం చెరువుకు వచ్చి చేరడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది తొలగిపోయినట్టేనని భావిస్తున్నారు. కంభం చెరువు పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది.