Prabhas- Mahesh Multi Starrer: మహేష్- ప్రభాస్‌లతో జక్కన్న మల్టీస్టారర్..?
Prabhas- Mahesh Multi Starrer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో… ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also […]
Prabhas- Mahesh Multi Starrer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో… ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న దానిపై క్లారిటీ లేదు. అయితే తాజాగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: NTR Next Movie With Asuran Director Vetrimaaran
జక్కన్న మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉందని రాజమౌళి గతంలోనే చెప్పారు. ఆ మూవీకి కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.