మరోసారి థియేటర్లలో ‘బాహుబలి’

కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో మార్చి నుంచి దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతా లాక్‌డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.

మరోసారి థియేటర్లలో బాహుబలి

Updated on: Nov 05, 2020 | 10:27 AM

కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారడంతో మార్చి నుంచి దేశంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతా లాక్‌డౌన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. అన్ని ఇండస్ట్రీలు మూతపడ్డాయి. సినిమా ఇండస్ట్రీపై కోలుకోలేని దెబ్బపడింది. థియేటర్లను తెరుచుకోవచ్చని గత నెలలోనే కేంద్రం ఆదేశాలిచ్చినప్పటికీ, ఇప్పటికి కూడా సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి  వచ్చింది.  దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మల్టీఫ్లెక్సులు తెరచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్‌ స్క్రీన్ల్‌తోనే థియేటర్లు నడుస్తున్నాయి. అయినా కానీ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి కనబరచడం లేదు.  గురువారం నుంచి మహారాష్ట్రలో, నవంబరు 10 నుంచి తమిళనాడులోనూ థియేటర్స్ తెరవనున్నారు. అయితే వీటిల్లో ప్రదర్శించడానికి కొత్త సినిమాలు లేవు. దీంతో గతంలో మంచి హిట్టైన సినిమాలనే మళ్లీ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బాహుబలి సిరీస్‌ను రీ-రిలీజ్‌ చేస్తున్నట్లు కరణ్‌జోహర్‌ ప్రకటించారు. హిందీవర్షన్‌ ‘బాహుబలి- బిగినింగ్‌’ను ఈ శుక్రవారం, ‘బాహుబలి-కన్‌క్లూజన్‌’ను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెండితెర మీద మరోసారి బాహుబలిని చూడటానికి ఆడియెన్స్ వస్తారని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు.

Also Read :

ఏపీ : స్కూళ్లలో కరోనా వ్యాప్తి, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు

ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ, అంతా క్షేమం

మెట్రో రైలులో ప్రయాణించిన పవర్‌స్టార్

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ !