పతనమైన గుడ్డు ధర, ఆందోళనలో ఫౌల్ట్రీ యజమానులు : కార్తీక మాసం ప్రభావంతో పాటు మరికొన్ని కారణాలు !

|

Dec 09, 2020 | 9:42 PM

కార్తీక మాసం ఎఫెక్ట్ ఫౌల్ట్రీ ఇండస్ట్రీపై పడింది. జనం ఈ మాసంలో ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు. నాన్-వెజ్‌తో పాటు గుడ్డు కూడా తినరు. ఈ క్రమంలో స్థానికంగా డిమాండ్ తగ్గింది.

పతనమైన గుడ్డు ధర, ఆందోళనలో ఫౌల్ట్రీ యజమానులు : కార్తీక మాసం ప్రభావంతో పాటు మరికొన్ని కారణాలు !
Follow us on

కార్తీక మాసం ఎఫెక్ట్ ఫౌల్ట్రీ ఇండస్ట్రీపై పడింది. జనం ఈ మాసంలో ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు. నాన్-వెజ్‌తో పాటు గుడ్డు కూడా తినరు. ఈ క్రమంలో స్థానికంగా డిమాండ్ తగ్గింది. ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో గుడ్డు ధర రూపాయికి పైగా తగ్గింది. అక్టోబర్ గుడ్డు ధర రూ. 5.29 ఉండగా, ప్రస్తుతం రూ.3.90 కి తగ్గిపోయింది. దీంతో కోళ్ల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుస తుఫాన్‌లు, చలి నేపథ్యంలో ఖర్చులు కూడా భారీ పెరిగాయని చెబుతున్నారు. చలి తీవ్రత పెరగడం వల్ల 5 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు కోళ్లు 10 శాతం మేత ఎక్కువగా తింటున్నాయని చెబుతున్నారు. దీంతో కృత్రిమ వేడి కోసం విద్యుత్ వినియోగం పెరిగిందని, బయో సెక్యూరిటీ నిర్వహణ ఖర్చులు పెరిగాని ఫౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.

Also Read :

Bigg Boss Telugu 4 : అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతు, తొలిసారి తెలుగు బిగ్ బాస్ కిరీటం ‘ఆమె’ ఖాతాలో

 ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు