Pongal Effect: పల్లెకు బయలుదేరిన పట్నం వాసులు.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ప్రయాణికులతో కిటకిటలాడుతోన్న..

|

Jan 13, 2021 | 1:00 AM

Pongal Effect In HYD: పట్నం వాసులు పల్లెకు బయలుదేరి వెళుతున్నారు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని జంటనగరాల నుంచి పల్లెకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు..

Pongal Effect: పల్లెకు బయలుదేరిన పట్నం వాసులు.. హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. ప్రయాణికులతో కిటకిటలాడుతోన్న..
Follow us on

Pongal Effect In HYD: పట్నం వాసులు పల్లెకు బయలుదేరి వెళుతున్నారు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని జంటనగరాల నుంచి పల్లెకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత రద్దీ మొదలైంది. సికింద్రబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ బాగా పెరిగిపోయింది. ఇక ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ బస్‌స్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.
ఓవైపు ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డ ప్రైవేటు ట్రావెల్‌ యాజమాన్యాలు విపరీతంగా టికెట్ల ధరలను పెంచేశాయి. ఒకేసారి భారీ సంఖ్యలో వాహనాలు నగరాన్ని వీడుతుండడంతో ఎల్బీనగర్‌ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కూకట్‌ పల్లి నుంచి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆర్టీసీ బస్సులతో పాటు సొంత వాహనదారులు కూడా పల్లె బాట పట్టడంతో ట్రాఫిక్‌ భారీగా పెరిగింది.

Also Read: Sankranti special bus services : పల్లెకు పోదాం చలో చలో.. సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులు