జైపాల్‌ రెడ్డి మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

| Edited By:

Jul 28, 2019 | 10:58 AM

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జైపాల్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్, కేంద్రమంత్రిగా దేశానికి జైపాల్ రెడ్డి […]

జైపాల్‌ రెడ్డి మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
Follow us on

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా నిమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా జైపాల్‌తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని రాజకీయ నేతలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ జైపాల్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్, కేంద్రమంత్రిగా దేశానికి జైపాల్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. జైపాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఓ గొప్ప నేతను కోల్పోయామన్నారు. ఇక మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జైపాల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేవరకొండలో కలిసి చదువుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 1978లో జనతాపార్టీలో ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశామన్నారు.

జైపాల్ రెడ్డి మరణం పట్ల మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత డీకే అరుణ సంతాపం తెలియజేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి చేసిన దేశానికి చేసిన సేవలను ఎప్పటికీ మరువలేనివన్నారు. జైపాల్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.