celebrities new year wishes: 2020 సంవత్సరం అందరి జీవితాలలో ఒక కొత్త మార్పును తీసుకువచ్చింది. కొందరికి జీవితాల్లో చీకట్లను నింపింది. 2020 కొంత చెడు చేసిన కొన్ని మంచే చేసింది. ఏది ఏమైనా 2020 ఏడాది ముగిసింది. అందరు ఎంతో సంతోషంగా.. ఎన్నో ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. అటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
“2021 ఇది మొదటి ఉదయం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషం, విజయం అందించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్” అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు.
Here’s the first sunrise of 2021, in case you missed it 🙂 Praying for everyone’s success and happiness, wishing for a great year ahead! Happy New Year everyone pic.twitter.com/j4my0Q7Kcx
— Akshay Kumar (@akshaykumar) January 1, 2021
ఈ నూతన సంవత్సరం ప్రజలందరికి సంతోషాన్ని అలాగే శాంతిని అందించాలి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Wishing everyone a very #HappyNewYear. May this year bring joy, prosperity and peace to all.
— Revanth Reddy (@revanth_anumula) January 1, 2021
రాష్ట్ర ప్రజలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. “కరోనా కష్టాలను వెనక్కు నెట్టుతూ.. ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఉత్సాహాన్ని, సంతోషాన్ని అందించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు #HappyNewYear2021 pic.twitter.com/MLC3cPsehX
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) December 31, 2020
“2021లో రాష్ట్ర ప్రజలందరు తాము తీసుకున్న నిర్ణయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు నీటి సరాఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
We wish everyone a very happy and prosperous new year.#HappyNewYear pic.twitter.com/KOiiJy7LwV
— Errabelli DayakarRao (@DayakarRao2019) January 1, 2021
తెలుగు హీరో వరుణ్ తేజ్ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. 2021 ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాల్ని నింపాలని కొరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఇటీవల వరుణ్ తేజ్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ కరోనాకు చికిత్స తీసుకుంటున్నాడు ఈ మెగా హీరో.
#HappyNewYear2021 ??? pic.twitter.com/fm2PI00mCu
— Varun Tej Konidela ? (@IAmVarunTej) December 31, 2020
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తీయబోయే ‘అయినను పోయిరావలె హస్తినకు’ చిత్రీకరణలో పాల్గొనున్నట్లుగా సమాచారం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. Wishing you all a very Happy New Year
— Jr NTR (@tarak9999) January 1, 2021
“ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలిపారు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ శాఖ మంత్రి ఈటెల రాజెందర్.
#HappyNewYear2021 pic.twitter.com/dEPCwtA3iY
— Eatala Rajender (@Eatala_Rajender) December 31, 2020
“గత సంవత్సరం కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోయింది. అందరం ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ చిరునవ్వులను పంచాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు”.. అంటూ ట్వీట్ చేశాడు.
గత సంవత్సరం కరోనా నామ సంవత్సరంగా మిగిలిపోయింది. అయితేనేం దేశం ఒక మహా విపత్తును ధైర్యంగా ఎదుర్కొంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం మనం. ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాదికీ చిరునవ్వులను పంచాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు pic.twitter.com/gaORBokCuC
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021
“మనం కొత్త అధ్యాయనాన్ని ప్రారంభించాం. ఈ నూతన సంవత్సరం రాష్ట్రానికి అలాగే ప్రజలకు శాంతి మరియు అత్యంత సంపదను తీసుకురావాలి. అలాగే మీ కలలను నెరవేర్చుకోవడానికి మీకు మరింత బలం చేకూరాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను” అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
As we begin this new chapter, wishing you all a joyous and healthy 2021. May this year bring peace and immense prosperity to our state and our people. I pray that you get the strength to fulfill all your dreams and aspirations. #HappyNewYear2021
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2021
“ఈ సంవత్సరం మన అందరికీ ఎన్నో భరించలేని కష్టాలని పరిచయం చేసింది. కానీ మనం రెట్టింపు బలంతో ముందుకు సాగటానికి సిద్ధం అయ్యాం. ఇలాగే మన అందరి బంధం మరింత బలంగా మారాలి. అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
Happy and Healthy 2021 to each and every one of you !!! pic.twitter.com/8fSRUd1mbp
— Ram Charan (@AlwaysRamCharan) December 31, 2020
“ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 2020 సంవత్సరంలో నెర్చుకున్న పాఠాల నుంచి ముందుకు కదిలి 2021 సంవత్సరం మీ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
My heartiest wishes to all to have a merrier and healthier New Year ahead. May the brightness of 2021 and learnings from 2020 lead the way forward. Stay blessed! #HappyNewYear2021
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 1, 2021
“గత సంవత్సరం కలిగించిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నింటినీ ఈ కొత్త సంవత్సరంలో అధిగమించి.. మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను, విజయాలను అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రజలందరీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 2020 సంవత్సరం కలిగించిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ ఈ కొత్త సంవత్సరంలో అధిగమించి… మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలను, ఆరోగ్య ఐశ్వర్యాలను, విజయాలను అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. pic.twitter.com/Y9JpE2S2un
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 1, 2021
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అందులో.. ఈ కొత్త సంవత్సరం నూతన ప్రపంచంలో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.
Wishing you all a very happy New Year!!A new decade and a beautiful new world!! May you all be blessed with health and happiness!!? pic.twitter.com/G5i6mmwydl
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 31, 2020
జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా.. ” దేశ ప్రజలకు కొవిడ్ టీకా నుంచి రక్షణ పొందాలని, అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని.. దేశప్రజలు, తెలుగు వారికి నా తరపున, జనసేన శ్రేణుల తరుపున నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు – జనసేనాని #PawanKalyan @PawanKalyan #HappyNewYear2021 pic.twitter.com/eeBeE01RKr
— BARaju (@baraju_SuperHit) December 31, 2020
2021 న్యూఇయర్ విషెస్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో షేర్ చేశాడు. అందులో.. “థ్యాంక్యు 2020, మాకు ఓర్పును నేర్పావు, మా జీవితాలను మార్చావు. ప్రకృతి ఎంత విలువైందో అర్థమయ్యేలా చేశావు. వెల్ కమ్ టూ ది న్యూఇయర్, ఈ కొత్త సంవత్సరం అందరికి బాగుండాలి. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్ని నిజం కావాలి. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యప్పీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూఇయర్ అంటూ ట్వీట్ చేశారు.
Wishing a Very Happy, Healthy & Fulfilling New Year 2021 for you and all your dear ones!?? pic.twitter.com/ckNl8jNdKp
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 31, 2020