Cockfights: కోడి కత్తులు తయారు చేసేవారిపై బైండోవర్ కేసులు.. ఈసారి పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

|

Jan 08, 2021 | 2:18 PM

కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పందేల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి కోడి పందేలను ఎట్టి పరిస్థితిల్లోనూ జరగనివ్వకుండా...

Cockfights: కోడి కత్తులు తయారు చేసేవారిపై బైండోవర్ కేసులు.. ఈసారి పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్
Follow us on
 Cockfights in Godavari districts: కోడి పందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పందేల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి కోడి పందేలను ఎట్టి పరిస్థితిల్లోనూ జరగనివ్వకుండా పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బరులకు స్థలాలు ఇచ్చేవారికి నోటీసులు జారీ చేశారు. తాజాగా కోడి కత్తులు తయారు చేసే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు.  తణుకు శివాలయం వీధిలో కోడికత్తులు తయారు చేసే వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద లభించిన 1035 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
కోడికి కత్తులు కట్టే మండపాకకు చెందిన వ్యక్తిని ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిచ్చిన పక్కా సమాచారంతో తణుకు పట్టణ ఎస్‌ఐ కె.రామారావు సిబ్బందితో కలిసి కోడికత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తణుకుకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేవారు. ఇద్దరినీ తహసీల్దార్‌ కోర్టులో హాజరుపరచి బైండోవర్‌ చేశారు పోలీసులు.

నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలు, గుండాటలు, పేకాటలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు పట్టణ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామారావు హెచ్చరించారు. ఇప్పటి వరకూ సర్కిల్‌ పరిధిలో 110 కేసులు నమోదు చేసి 500 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.

Also Read :

Covid Strain Cases In India: దేశంలో 82 కరోనా స్ట్రెయిన్ కేసులు.. అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు