ఓలా బైక్ రైడర్‌కు పోలీసుల షాక్!

| Edited By:

Dec 21, 2019 | 8:05 AM

ఓ ఓలా బైక్ రైడర్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఓలా రైడర్‌పై కేసు నమోదు చేయడమే కాకుండా.. అతనికి 500 రూపాయల జరిమానా కూడా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఈ నెల 18న రాత్రి 10.30లకు మైండ్ స్పేస్ నుంచి బంజారాహిల్స్ వెళ్లడానికి ఓలా బైక్‌ని బుక్ చేసుకున్నాడు. అయితే.. ఆ వ్యక్తి ఎంతకీ రావడం లేదు. అప్పటికే గంట సమయం అయిపోవడంతో.. అతనికి ఫోన్ చేయగా.. ‘సారీ సార్ నేను […]

ఓలా బైక్ రైడర్‌కు పోలీసుల షాక్!
Follow us on

ఓ ఓలా బైక్ రైడర్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఓలా రైడర్‌పై కేసు నమోదు చేయడమే కాకుండా.. అతనికి 500 రూపాయల జరిమానా కూడా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. సాయితేజ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఈ నెల 18న రాత్రి 10.30లకు మైండ్ స్పేస్ నుంచి బంజారాహిల్స్ వెళ్లడానికి ఓలా బైక్‌ని బుక్ చేసుకున్నాడు. అయితే.. ఆ వ్యక్తి ఎంతకీ రావడం లేదు. అప్పటికే గంట సమయం అయిపోవడంతో.. అతనికి ఫోన్ చేయగా.. ‘సారీ సార్ నేను రాలేను.. మీరు వేరే వెహికల్ చూసుకోని, బుకింగ్ క్యాన్సెల్ చేయడంటూ’ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో షాక్ తిన్న సాయితేజ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై స్పందించిన పోలీసులు.. ఆ ఓలా బైక్ రైడర్‌ను పట్టుకుని.. కేసు నమోదు చేసి రూ.500 ఫైన్ వేశారు. కాగా.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారికిపై ఎంవీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇదివరకే తెలిపారు. ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువగా జరగడంతో.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో.. వారు ఊబర్, ఓలా క్యాబ్స్, బైక్ రైడర్స్‌ ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా.. ఇలాంటి తరహా కేసు నమోదు కావడం తెలంగాణలో ఇదే మొదటిసారి. అలాగే సాయితేజను పోలీసులు అభినందించారు. ఇలాగే అందరూ స్పందించాలని కోరారు.