సెల్ఫీ పిచ్చి.. న‌దికి పోటెత్తిన వ‌ర‌ద.. ఇంతలోనే..!

మధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామానికి చెందిన ఎనిమిది మంది అమ్మాయిలు త‌మ గ్రామానికి స‌మీపంలో ఉన్న పెంచ్ న‌ది వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌డంతో ఎంజాయ్ చేస్తూ

సెల్ఫీ పిచ్చి.. న‌దికి పోటెత్తిన వ‌ర‌ద.. ఇంతలోనే..!

Edited By:

Updated on: Jul 24, 2020 | 5:10 PM

Police Rescued Stranded Girls: మధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామానికి చెందిన ఎనిమిది మంది అమ్మాయిలు త‌మ గ్రామానికి స‌మీపంలో ఉన్న పెంచ్ న‌ది వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌డంతో ఎంజాయ్ చేస్తూ ఫోటోల పిచ్చిలో ప‌డిపోయారు. ఓ ఇద్ద‌రు యువ‌తులు న‌దిలో ఉన్న ఓ రాయి వ‌ద్ద‌కు వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇంత‌లోనే న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. ఆ ఇద్ద‌రిని గ‌మ‌నించిన మిగ‌తా అమ్మాయిలు స్థానికుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి యువ‌తులిద్ద‌రిని ర‌క్షించారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఆ ఇద్ద‌రు అమ్మాయిలు పోలీసుల‌కు, స్థానికుల‌కు, ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. ముందే వ‌ర్షాకాలం కాబ‌ట్టి చెరువులు, న‌దీ తీర ప్రాంతాల‌కు వెళ్ల‌క‌పోతేనే మంచిది అని పోలీసులు సూచించారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..