లాక్‌డౌన్ ఎఫెక్ట్: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన పోలీసులు..!

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 2:33 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఓ డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జంటకు వివాహం జరిపించేందుకు పోలీసులే తల్లిదండ్రుల అవతారమెత్తారు.

లాక్‌డౌన్ ఎఫెక్ట్: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన పోలీసులు..!
Follow us on

Police play parents role: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఓ డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జంటకు వివాహం జరిపించేందుకు పోలీసులే తల్లిదండ్రుల అవతారమెత్తారు. లాక్‌‌డౌన్‌లో చిక్కుకున్న ఇరు కుటుంబాల విజ్ఞప్తి మేరకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. మహారాష్ట్రలోని పుణేలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. నగరానికి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఆయన సతీమణి వరుడికి కన్యాదానం చేయగా… ఈ కార్యక్రమాన్ని వధూవరుల కుటుంబాలు వీడియో కాల్ ద్వారా వీక్షించాయి. వివాహం కోసం పోలీసులు అమనోరా క్లబ్ హౌస్‌ను బుక్ చేయడంతో పాటు, ఓ పూజారిని కూడా పిలిపించారు. వధూవరుల తండ్రులిద్దరూ విశ్రాంత ఆర్మీ అధికారులే కావడం విశేషం.

మరోవైపు.. వరుడు ఆదిత్య సింగ్ బిస్త్ మాట్లాడుతూ… ‘‘డెహ్రాడూన్‌లో మా వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా మేము అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. అయితే మే 2న ముహూర్తం సమయానికే మా వివాహం జరగడం సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా పుణే పోలీసులు దగ్గరుండి మా వివాహం జరిపించారు..’’ అని పేర్కొన్నాడు.

Also Read: 45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్.. 6 నెలల వరకు నో ఈఎంఐ..