BREAKING NEWS : శిరోముండనం చేసిన అధికారిపై వేటు పడింది..

|

Jul 22, 2020 | 5:33 AM

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనపై పోలీస్ అధికారులు స్పందించారు. అందుకు కారణమైన పోలీసులపై వేటు వేశారు. సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిపై పోలీసులు దాడి చేసి పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడికి గాయాలయ్యేలా..

BREAKING NEWS : శిరోముండనం చేసిన అధికారిపై వేటు పడింది..
Follow us on

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అమానవీయ ఘటనపై పోలీస్ అధికారులు స్పందించారు. అందుకు కారణమైన పోలీసులపై వేటు వేశారు. సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిపై పోలీసులు దాడి చేసి పోలీస్‌స్టేషన్‌లోనే యువకుడికి గాయాలయ్యేలా కొట్టి, శిరోముండనం చేశారు. ఈ ఘటనకు కారణమైన ట్రైనీ ఎస్సై SK ఫీరోజ్ షాను సస్పెండ్ చేశారు. అతనితోపాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను కూడా సస్పెండ్ చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా రాజమహేంద్రవరం అర్భన్ ఎస్పీ షిమోషి బాజ్ పెయ్ వెల్లడించారు.

అయితే.. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలను ఆపిన సమయంలో స్థానిక మునికూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు ఆరోపించిన సంగతి తెలిసిందే.