వైఎస్ వివేకానంద హత్య కేసులో పోలీసుల తప్పుంది: చంద్రబాబు

|

Mar 15, 2019 | 9:57 PM

అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వివేకా హత్య కేసు విషయంలో ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందులో ముఖ్యమైన ప్రశ్నగా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్‌ను చెడగొట్టడాన్ని తప్పుపట్టారు. రక్తం ఎక్కువగా ఉండి శరీరమంతా గాయాలున్నప్పుడు ఫొరెన్సిక్ సాక్ష్యాలను చెడగొట్టే విధంగా మృత దేహాన్ని ఎందుకు కదిలించారని చంద్రబాబు ప్రశ్నించారు. రక్తాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన అన్నారు. […]

వైఎస్ వివేకానంద హత్య కేసులో పోలీసుల తప్పుంది: చంద్రబాబు
Follow us on

అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వివేకా హత్య కేసు విషయంలో ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తారు. అందులో ముఖ్యమైన ప్రశ్నగా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్‌ను చెడగొట్టడాన్ని తప్పుపట్టారు.

రక్తం ఎక్కువగా ఉండి శరీరమంతా గాయాలున్నప్పుడు ఫొరెన్సిక్ సాక్ష్యాలను చెడగొట్టే విధంగా మృత దేహాన్ని ఎందుకు కదిలించారని చంద్రబాబు ప్రశ్నించారు. రక్తాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన అన్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్‌కు ఇబ్బంది కలిగేలా డెడ్ బాడీని తరలిస్తున్నప్పుడు పోలీసులు అడ్డు చెప్పకపోవడం పోలీసుల తప్పని సీఎం చంద్రబాబు అన్నారు.

కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చిన కారణంగా అక్కడున్న సీఐ ఈ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఫొరెన్సిక్ ఎవిడెన్స్‌ను ఎప్పుడూ కాపాడుకోవాలనే విషయాన్ని తాను ఎప్పుడు పోలీసులకు చెబుతూ ఉంటానని చంద్రబాబు అన్నారు.