సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

| Edited By:

Sep 29, 2019 | 4:47 AM

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌కు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన సినిమాకు మంచి కథ ఇస్తానని చెప్పి తనను మోసం చేసి నగదు తీసుకున్నారని జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలం గడుస్తున్నా తనకు కథను అందివ్వకపోగా , తాను ముట్టజెప్పిన డబ్బు సైతం తిరిగి ఇవ్వడం లేదని ప్రసాద్ ఆరోపించారు. […]

సినీ రచయిత కోన వెంకట్‌పై చీటింగ్ కేసు
Follow us on

టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌కు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన సినిమాకు మంచి కథ ఇస్తానని చెప్పి తనను మోసం చేసి నగదు తీసుకున్నారని జెమిని ఎఫ్‌ఎక్స్ సంస్థ డైరెక్టర్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలం గడుస్తున్నా తనకు కథను అందివ్వకపోగా , తాను ముట్టజెప్పిన డబ్బు సైతం తిరిగి ఇవ్వడం లేదని ప్రసాద్ ఆరోపించారు. పైగా తమనే బెదిరిస్తున్నాడంటూ కోన వెంకట్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.