
PM Modi Office Sale: కేటుగాళ్లు బరి తెగించారు. ఆన్‌లైన్‌లో ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫీస్‌నే అమ్మకానికి పెట్టారు. సదరు పోస్టు ఓఎల్ఎక్స్(OLX)లో దర్శనమివ్వడంతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. వారణాసిలోని మోదీ ఎంపీ కార్యాలయాన్ని విల్లాగా పేర్కొంటూ పూర్తి వివరాలతో పాటు ఫోటోలను కూడా జతచేసి కేటుగాళ్లు OLX వెబ్‌సైట్‌లో ప్రకటన ఇచ్చారు.
సదరు బిల్డింగ్ 6500 చదరపు గజల్లో ఉందని సైట్‌లో పొందుపరిచారు. ఇక ఈ తతంగం మొత్తం వారణాసి పోలీసుల దృష్టికి వెళ్ళింది. ఈ వ్యవహారంపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పోస్టును తొలగించడంతో పాటు దానికి కారకులైన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారణాసి సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ పాథక్ తెలిపారు.
Also Read:
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..
‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..
‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..