కోవిడ్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని మోదీ తన ట్విట్టరులో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ వెల్లడించారు. తన సలహాదారుణి హూప్ హిక్సుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ట్రంప్, మెలానియా ట్రంప్‌లు గురువారం రాత్రి కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు పాజిటివ్ అని శుక్రవారం ఉదయం తేలింది. దీంతో ట్రంప్ దంపతులు క్వారంటైన్ లోకి వెళ్లారు. ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్సుకు మొదట కరోనా వైరస్ సోకింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు అతనితో కలిసి హూప్ హిక్సు మంగళవారం ఎయిర్ ఫోర్సు వన్ విమానంలో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాము కరోనా వల్ల క్వారంటైన్‌లోకి వెళ్లామని ట్రంప్ ట్వీట్ చేశారు.
Wishing my friend @POTUS @realDonaldTrump and @FLOTUS a quick recovery and good health. https://t.co/f3AOOHLpaQ
— Narendra Modi (@narendramodi) October 2, 2020