బీహార్ లో మూడు పెట్రోలియం ప్రాజెక్టులను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టును, రెండు బాట్లింగ్ ప్రాజెక్టులను లాంచ్ చేసి వీటిని జాతికి అంకితం చేయనున్నారు. పరదీప్- హల్దియా -దుర్గాపూర్ పైప్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి దుర్గాపూర్-బంకా సెక్షన్ ను ఆయన మొదట ప్రారంభిస్తారు. 193 కి.మీ. పొడవైన ఈ పైప్ లైన్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించింది. గత ఏడాది ఫిబ్రవరి 17 న మోదీ దీనికి శంకు స్థాపన చేశారు. ఈ పైప్ లైన్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలను కూడా కలపడం విశేషం. ఇప్పటివరకు ఇంత పెద్ద పైప్ లైన్ ప్రాజెక్టు దేశంలో లేదని, ఇదే మొదటిదని అంటున్నారు. బీహార్ ఎన్నికలకు క్రమంగా సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ ప్రధానంగా ఈ రాష్ట్రంపై దృష్టి పెట్టింది.