PM Modi To Inaugurate: కొచ్చి – మంగళూరు గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ…

భారత ప్రధాని నరేంద్ర మోడీ కొచ్చి-మంగళూరు గ్యాస్‌ పైప్‌లైన్‌ను డిసెంబర్ 5 ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని...

PM Modi To Inaugurate: కొచ్చి - మంగళూరు గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ...

Edited By:

Updated on: Jan 05, 2021 | 11:44 AM

భారత ప్రధాని నరేంద్ర మోడీ కొచ్చి-మంగళూరు గ్యాస్‌ పైప్‌లైన్‌ను డిసెంబర్ 5 ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఓ పకటనను విడుదల చేసింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ ‌లో భాగంగా 450 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ను గెయిల్ (ఇండియా) లిమిటెడ్ నిర్మించిందని పేర్కొంది. ఈ పైప్ లైన్ ద్వారా రోజుకు 12 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల రవాణా సామర్థ్యం ఉందని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.3 వేల కోట్లు.

ప్రారంభ కార్యక్రమంలో…

పైప్‌లైన్ ప్రారంభం చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ప్రధాని అన్నారు. ఇది చాలా మంది ప్రజలను సానుకూలంగా ప్రభావితం చేసే భవిష్యత్ ప్రాజెక్ట్ అని మోడీ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కర్ణాటక, కేరళ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) రీగాసిఫికేషన్ టెర్మినల్ నుంచి సహజ వాయువును తరలిస్తుంది. కొచ్చి (కేరళ) నుంచి మంగళూరు (దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక), ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్‌, కాసరాగోడ్ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. పైప్‌లైన్‌ పర్యావరణ అనుకూలమైన, సరసమైన ఇంధనాన్ని పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) రూపంలో గృహాలకు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) రవాణా రంగానికి సరఫరా చేస్తుంది. ఇది పైప్‌లైన్ వెంట జిల్లాల్లోని వాణిజ్య, పారిశ్రామిక యూనిట్లకు సహజ వాయువును సరఫరా చేస్తుంది. క్లీనర్ ఇంధనం తీసుకోవడం వాయు కాలుష్యాన్ని అరికట్టడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Also Read: Bird Flu In India: చికెన్‌, గుడ్లపై నిషేధం.. అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం.