అడవిలో మోదీ.. ‘అడ్వెంచర్ షో’లో ఎంట్రీ

సాహసాలు చేసేందుకు ప్రధాని మోదీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 68సంవత్సరాల వయసులోనూ ఫిట్‌గా ఉండే ఆయన.. సెలబ్రిటీలు సవాల్ చేసే పలు ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ తానూ యువకుడిలాగే దూసుకుపోతుంటానని నిరూపించుకుంటున్నారు. అందుకు మరో సాక్ష్యం తాజాగా బయటికొచ్చింది. ప్రముఖ డిస్కవరీ ఛానెల్‌ నిర్వహించే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్‌’లో భాగమయ్యారు ప్రధాని మోదీ. ఆ షో వ్యాఖ్యాత బియర్ గ్రిల్స్‌తో కలిసి ఉత్తరాఖండ్ అడవిలో సాహసయాత్ర చేశారు ఆయన. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసిన సదరు […]

అడవిలో మోదీ.. ‘అడ్వెంచర్ షో’లో ఎంట్రీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2019 | 3:13 PM

సాహసాలు చేసేందుకు ప్రధాని మోదీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 68సంవత్సరాల వయసులోనూ ఫిట్‌గా ఉండే ఆయన.. సెలబ్రిటీలు సవాల్ చేసే పలు ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ తానూ యువకుడిలాగే దూసుకుపోతుంటానని నిరూపించుకుంటున్నారు. అందుకు మరో సాక్ష్యం తాజాగా బయటికొచ్చింది.

ప్రముఖ డిస్కవరీ ఛానెల్‌ నిర్వహించే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్‌’లో భాగమయ్యారు ప్రధాని మోదీ. ఆ షో వ్యాఖ్యాత బియర్ గ్రిల్స్‌తో కలిసి ఉత్తరాఖండ్ అడవిలో సాహసయాత్ర చేశారు ఆయన. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసిన సదరు ఛానెల్.. ఆగష్టు 12న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని పేర్కొంది. ఇక తాజా ప్రోమోలో గ్రిల్స్‌ను ఇండియాకు స్వాగతించిన మోదీ.. వెదురుతో చేసిన ఓ ఆయుధాన్ని చేతిలో పట్టుకొని ‘‘దీన్ని నా వద్దే ఉంచుకుంటాను’’ అని అంటారు. దానికి గ్రిల్స్ నవ్వుతూ స్పందిస్తూ.. ‘‘మీరు భారత్‌కు చాలా ముఖ్యమైన వారు. మిమ్మల్ని బాగా చూసుకోవడమే నా పని’’ అని అంటాడు. కాగా ఈ షోలో జంతు సంరక్షణ, వాతావరణంలో మార్పులపై అందరికీ అవగాహనను కల్పించనున్నారు ప్రధాని మోదీ, గ్రిల్స్ ఇద్దరూ.