ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 27 నుంచి జపాన్‌లోని ఒసాకాలో జరిగే జీ-20 సదస్సుకు మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రధాని వెంట మాజీ కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు కూడా జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జీ -20 సదస్సుకు వివిధ దేశాల అధినేతలు కూడా హాజరవుతున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ. ఇండోనేషియా, ఇటలీ, రష్యా అధినేతలతో ప్రధాని చర్చలు జరపనున్నారు.