ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. నేషనల్ హైవే-19లో భాగమైన హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్నారు. 73 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం కోసం గవర్నమెంట్ రూ.2,447 కోట్లు ఖర్చు చేసింది. ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే అలహాబాద్ నుంచి వారణాసి చేరుకునేందుకు గతంలో కంటే గంట సమయం తక్కువ పడుతుంది.
ఇక ఈ పర్యటనలో ప్రధాని.. కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ నిర్వహణ పనులను రివ్యూ చేయనున్నారు. సారనాథ్ పురావస్తు ప్రదేశంలో నిర్వహిస్తోన్న ఓ లైట్ షోకు హాజరుకానున్నారు. తర్వాత, వారణాసిలోని దేవ్ దీపావళి కార్యక్రమానికి వెళ్లనున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వారణాసిలో రాజ్ ఘాట్ వద్ద ప్రధాని దీపం వెలిగించనున్నారు. కార్తీక పౌర్ణిమ పురస్కరించుకుని గంగా తీరంలో దాదాపు 11 లక్షల దీపాలు వెలిగిస్తారు భక్తులు.
Also Read :
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !
Ind vs Aus : రెండో వన్డేలో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు