పీఎం కిసాన్ సొమ్ము రూ. 2000 పడ్డాయో.. లేదో చెక్ చేసుకోండిలా!

|

Aug 09, 2020 | 10:47 PM

పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ నేడు రూ. 17.100 కోట్లను బదిలీ చేశారు.

పీఎం కిసాన్ సొమ్ము రూ. 2000 పడ్డాయో.. లేదో చెక్ చేసుకోండిలా!
Follow us on

Sixth Installment Of Kisan Fund: పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ నేడు రూ. 17.100 కోట్లను బదిలీ చేశారు. 2018లో లాంచ్ అయిన ఈ పధకం ఆరో విడత ఇన్స్‌స్టాల్‌మెంట్‌ నిధులను ఇవాళ విడుదల చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ  స్కీంలో భాగంగా మొత్తం 9.9 కోట్ల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా 75 వేల కోట్లను అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు. న్యూ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కోసం ప్రభుత్వం లక్ష కోట్లను కేటాయించింది. పీఎం కిసాన్ పథకం కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున( రూ. 2వేలు మూడు విడతలుగా) అందజేస్తారు.

అయితే ఈ డబ్బులు రైతులు తమ అకౌంట్లలో జమ అయ్యాయా? లేదా అన్న విషయాన్ని చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాలెన్స్ చెక్ చేయడానికి pmkisan.gov.in వెబ్‌సైట్‌తో కనెక్ట్ అయి ఉండాలి. అక్కడ Farmers Cornerలో Beneficiary Statusపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్లలో ఏదో ఒకటి ఎంటర్ చేసి Get Data అని క్లిక్ చేస్తే.. అర్హుల జాబితాలో మీరు పేరు ఉందో లేదో ఈజీగా తెలిసిపోతుంది.

ఇక ఒక వేళ మీ ఖాతాలో డబ్బు జమ కాకపోతే, మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. అక్కడ మీ పని జరగకపోతే, మీరు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకోవచ్చు. మీరు PM-Kisan హెల్ప్‌లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ 1800115526 ను సంప్రదించవచ్చు. ఇది కాకుండా, మీరు మంత్రిత్వ శాఖ నంబర్ (011-23381092) ను కూడా సంప్రదించవచ్చు.