జొబైడెన్ కి ప్రధాని మోదీ ఫోన్, కంగ్రాట్స్, ఇండో-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ

| Edited By: Pardhasaradhi Peri

Nov 18, 2020 | 10:59 AM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ కి ప్రధాని మోదీ కంగ్రాట్స్ చెప్పారు. భారత, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగ్వస్వామ్యంపై ఉభయులూ చర్చించారు. రెండు దేశాలు ఎదుర్కొంటున్న..

జొబైడెన్ కి ప్రధాని మోదీ ఫోన్, కంగ్రాట్స్, ఇండో-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ
Follow us on

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ కి ప్రధాని మోదీ కంగ్రాట్స్ చెప్పారు. భారత, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగ్వస్వామ్యంపై ఉభయులూ చర్చించారు. రెండు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రాధాన్యతలపైన, కోవిడ్ 19 అదుపుపైన తాము చర్చించినట్టు మోదీ ఆ తరువాత తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంత సహకారం, తదితర అంశాలు కూడా తమ మధ్య ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. అటు ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టనున్న కమలా హారిస్ కి  మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉగ్రవాదంఫై పోరులో భారత, అమెరికా దేశాల మధ్య సహకారం మరింత పెంపొందాలని జో బైడెన్ ఆకాంక్షించారు. బాధ్యతాయుత భాగస్వాములుగా రెండు దేశాలూ కీలకాంశాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.   రక్షణ రంగంలో ఇండియా-అమెరికా మధ్య వ్యూహాత్మక సహకారం మరింత పెరగనున్నట్టు సమాచారం.