బీహార్ డిష్ తిన్న మోదీ.. అక్టోబర్ ఎన్నికల్లో గెలుస్తుందా బీజేపీ ?

ఢిల్లీ ఎన్నికల్లో వాడిన 'కమలం' బీహార్ ఎన్నికల్లో గెలుస్తుందా ? అక్టోబర్ నెలలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రధాని మోడీ ఆ రాష్ట్ర వంటకాన్ని క్రాఫ్ట్ ఫెస్ట్ లో రుచి చూశారంటే ముందు చూపుతోనేనా ? ఓ చిన్న విశ్లేషణ

బీహార్ డిష్ తిన్న మోదీ.. అక్టోబర్ ఎన్నికల్లో గెలుస్తుందా బీజేపీ ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 19, 2020 | 6:53 PM

‘బీహార్ డిష్’ తిన్నారు ప్రధాని మోదీ.. మట్టి కప్పుల్లో చాయ్ తాగారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ‘క్రాఫ్ట్ ఫెస్ట్’.. ‘హునార్ హాత్’ ఎగ్జిబిషన్ లో బీహార్ వంటకాన్ని (లిట్టీచొకా) రుచి చూశారు. మన ఆలు బజ్జీ లాంటిదే ఇదీ .. బీహార్ మహిళలతో కూడా మాట్లాడారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఓ విషయం చెప్పుకోవాలి.. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు మొదటివారం నుంచి ఎన్నికల ప్రక్రియ  మొదలవుతుంది. . జేడీ-యు అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది ఆ ఎన్నికల్లో తేలనుంది. ఆ ఎన్నికల్లో తమ బీజేపీ అధికారంలోకివచ్చేలా మోదీ.. ఇప్పటినుంచే ఆ రాష్ట్ర వంటకాల రుచి చూస్తున్నారా అని విశ్లేషకులు తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీకి జేడీ-యు మిత్రపక్షమైనప్పటికీ.. రెండూ కలిసి సుమారు 40 శాతం పైగా ఓట్లను సమీకరించగలుగుతాయి. కానీ ఎంత మిత్ర పక్షమైనా.. ఒకే సీటులో ఇద్దరూ (మోడీ లేదా నితీష్) కూర్చోలేరు. ఎవరో ఒక్కరు మాత్రమే కూర్చోవలసిందే.. ఢిల్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లను మాత్రమే గెలుచుకుని..వాడిపోయిన ‘ కమలం’ బీహార్ ఎన్నికల్లో వికసించాలంటే ఇప్పటినుంచే ఆ రాష్ట్ర వంటకాలను ప్రధాని రుచి చూసి..  ఆరాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. జెడి-యుతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందా లేక ఆ సమయానికి ఒంటరిగానే పోటీ చేస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేం.. సీఏఏ వంటి చట్టాల విషయంలో బీజేపీతో జేడీ-యు గళం కలుపుతున్నప్పటికీ..రెండు పార్టీల మధ్య మరీ  ‘గాఢమైన పవిత్ర బంధమేదీ’ లేదు. ఎన్నికల వేళ.. సీట్ల సిగపట్లు, అభ్యర్థుల ఎంపికలో పాట్లు.. రెండు ప్రధాన పార్టీల మధ్య ‘చిచ్ఛు’ రేపినా రేపవచ్చు. అయినా ఎందుకైనా మంచిదని మోదీ.. బీహార్ డిష్ తిన్నారంటే ఆ రాష్ట్రం మీద ముందు చూపుతో కన్నేశారన్న మాటే !