వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం

మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ తుదిశ్వాస విడిచారు.

వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం

Updated on: Oct 11, 2020 | 5:11 PM

మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ కిమ్స్  ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  బ్రెయిన్‌ స్ట్రోక్‌‌కు గురికావడంతో ఆమె చనిపోయినట్టు తెలిపారు.

సత్యనారాయణమ్మ అకాల మరణంతో సుభాష్ చంద్రబోస్ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మరణ వార్త తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున రామచంద్రాపురంలోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే చంద్రబోస్‌ను సీఎం జగన్మోహనరెడ్డి ఫోన్లో పరామర్శించారు. సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం రామచంద్రపురంకు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ( ఖమ్మం జిల్లా : ఆ ఊరిలో 20 రోజుల్లో 12 మరణాలు )