కోవిడ్ 19 కాలర్ ట్యూన్ నుంచి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ (గళాన్ని) తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులోఓ పిల్ దాఖలైంది. కరోనా వైరస్ పై ప్రజల్లో ఎవేర్ నెస్ కలిగించడానికి ప్రభుత్వం బిగ్ బీ వాయిస్ తో ఓ కాలర్ ట్యూన్ ని రూపొందించింది. అయితే ఇందుకు ఆయనకు సర్కార్ డబ్బు చెల్లిస్తోందని , కానీ అసలైన కరోనా వారియర్లు ఎలాంటి సొమ్ము తీసుకోకుండా ఉచితంగా ఈ విధమైన సేవలు అందించడానికి రెడీగా ఉన్నారని పిటిషన్ దారు పేర్కొన్నారు. అసలు అమితాబ్ బచ్చన్ కే సరైన..స్వచ్ఛమైన చరిత్ర లేదని, ఆయనపై కొన్ని కోర్టుల్లో కేసులు ఉన్నాయని పిల్ వేసిన పిటిషన్ దారు తెలిపారు. బిగ్ బీ, ఆయన కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడిన విషయాన్ని విస్మరించరాదన్నారు.
సామాజిక కార్యకర్త అయినప్పటికీ అమితాబ్ దేశానికి సేవ ఏమీ చేయడంలేదని అంటూ ఢిల్లీ రెసిడెంట్ అండ్ సోషల్ వర్కర్ రాకేష్ ఈ పిల్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ డీ.ఎన్.పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిల్ ను విచారించనుంది. ఈ నెల 18 న దీనిపై విచారణ జరగనుంది.
బదాయూ ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం..