Pfizer Vaccine: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టీకాకు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో మంగళవారం నుంచి మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఒకవేళ ఈ టీకాకు ప్రభుత్వం అనుమతిస్తే.. దానికి సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి.
ఫైజర్ టీకాను 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది
వైరస్‌ను నియంత్రించేందుకు రెండు డోసులు తీసుకోవాలట. ఒక్కో డోస్ రూ. 1500 ఉంటుందట
డోసులు తీసుకున్న 28 రోజుల్లో వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది
మొదటి డోస్ తీసుకున్న 12 రోజుకు రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది.
21వ రోజున రెండో డోస్ తీసుకోవాలి
28వ రోజున పూర్తిస్థాయి రోగనిరోధక శక్తి అభివృద్ధి అవుతుంది.