జోరుగా ‘ఫైజర్’ కరోనా వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 1:55 PM

అమెరికాలోని ఫైజర్ కంపెనీ, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థలు తమ కరోనా వైరస్ వ్యాక్సీన్ ట్రయల్స్ మూడో దశను వేగవంతం చేశాయి. తాజాగా  దాదాపు 44 వేలమంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని..

జోరుగా ఫైజర్ కరోనా వ్యాక్సీన్ మూడో దశ ట్రయల్స్
Follow us on

అమెరికాలోని ఫైజర్ కంపెనీ, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ సంస్థలు తమ కరోనా వైరస్ వ్యాక్సీన్ ట్రయల్స్ మూడో దశను వేగవంతం చేశాయి. తాజాగా  దాదాపు 44 వేలమంది వలంటీర్లపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని ఈ సంస్థలు ప్రకటించాయి. మొదట తమ టార్గెట్ 30 వేలమందేనని, కానీ ఇప్పుడీ సంఖ్యను పెంచాలనుకుంటున్నామని ఇవి పేర్కొన్నాయి. వచ్ఛే వారం తమ తొలి టార్గెట్ ని చేరుకోవచ్ఛునని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. తమ తొలి దశ ట్రయల్స్ మంచి సానుకూల ఫలితాలను సాధించినట్టు గత ఆగస్టులో ఈ సంస్థలు ప్రకటించాయి. కాగా- ఈ కంపెనీల వ్యాక్సీన్ కి అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలపవలసి ఉంది.