దేవస్థానం పెట్రోల్ బంక్‌లో నిధులు గోల్‌మాల్‌

| Edited By: Anil kumar poka

Oct 18, 2019 | 8:01 PM

శ్రీశైలం దేవస్థానం పెట్రోల్‌ బంక్‌లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేవస్థానానికి చెందిన పెట్రోల్ బంకులో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. బంకులో పనిచేసే సిబ్బంది భారీగా చేతివాటం ప్రదర్శించినట్టు ఆడిట్‌లో వెల్లడైంది. మొత్తంగా 41 లక్షల రూపాయల అవకతవకలు జరిగినట్లు ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. అందులో పనిచేసే ఇద్దరు సిబ్బంది నగదు గోల్‌మాల్‌ చేశారనే అనుమానంతో దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీశైలం పోలీసులు ఇద్దరు కాంట్రాక్టు సిబ్బందిని […]

దేవస్థానం పెట్రోల్ బంక్‌లో నిధులు గోల్‌మాల్‌
Follow us on

శ్రీశైలం దేవస్థానం పెట్రోల్‌ బంక్‌లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేవస్థానానికి చెందిన పెట్రోల్ బంకులో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. బంకులో పనిచేసే సిబ్బంది భారీగా చేతివాటం ప్రదర్శించినట్టు ఆడిట్‌లో వెల్లడైంది. మొత్తంగా 41 లక్షల రూపాయల అవకతవకలు జరిగినట్లు ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. అందులో పనిచేసే ఇద్దరు సిబ్బంది నగదు గోల్‌మాల్‌ చేశారనే అనుమానంతో దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీశైలం పోలీసులు ఇద్దరు కాంట్రాక్టు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దేవస్థానం పెట్రోల్‌ బంక్‌లో విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు సీనియర్‌ అసిస్టెంట్లు సూపరింటెండెంట్‌ స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న సొమ్మునే గుట్టుచప్పుడు కాకుండా గట్టు దాటించేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు విషయం ఆనోట ఈనోట కొత్తగా వచ్చిన ఈవో కేఎస్‌ రామారావు దృష్టికి వెళ్లడంతో అసలు బండారం బయటపడింది.