వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఐదో రోజూ పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే..

|

Dec 06, 2020 | 2:12 PM

వాహనదారులకు షాకింగ్ న్యూస్. వరుసగా ఐదవ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం నాడు లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు...

వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఐదో రోజూ పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నేడు ఎంత పెరిగిందంటే..
Follow us on

వాహనదారులకు షాకింగ్ న్యూస్. వరుసగా ఐదవ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం నాడు లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు పెరగగా, డీజిల్‌పై 29 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరతో కలిపి దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ.83.41 లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.73.61కి చేరింది. ఇక హైదరాబాద్‌‌లో చూసుకున్నట్లయితే పెట్రోల్ ధర రూ.86.75 కి చేరగా, డీజిల్ ధర రూ.80.3 లకు చేరింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చూస్తే.. పెట్రోల్ లీటర్ ధర రూ.89.61 కాగా, డీజిల్ ధర రూ.82.71 గా ఉంది. గత ఐదు రోజులుగా వరుసగా పెట్రో, డీజిల్ ధరలు  పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలాఉంటే.. పెట్రోల్ ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరుకుంది.