పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న వకీల్‌సాబ్ రీమేక్ మూవీ కనుక.. దాని స్టోరీపై నైన్టీ పర్సెంట్ క్లారిటీ వుంది. ఇక క్రిష్ మూవీ రాబిన్‌హుడ్ థియరీతో వస్తోందన్నది అందరికీ తెలిసన విషయమే. మరి.. హరీష్‌శంకర్ మూవీలో పవన్ ఎలా కనిపించబోతున్నారు. ఈ మూవీ స్టోరీ లైన్‌పై ఇంట్రస్టింగ్ టాక్ నడుస్తోంది. బౌండెడ్ స్క్రిప్ట్ సీక్రెట్‌గానే వుంచినా.. స్టోరీపై వస్తున్న చిన్నచిన్న లీక్స్ అభిమానుల్లో ఆత్రుతను పెంచేస్తున్నాయి. లేటెస్ట్‌గా అందుతోన్న సమాచారం ఏంటంటే.. ఈ మూవీలో తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తారట పవర్‌స్టార్.
జల్సా లాంటి కొన్ని సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ వున్నా.. పవన్ గెటప్ అండ్ మేనరిజంలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించదు. ఒక్క తీన్‌మార్ మూవీలో మాత్రమే.. పవర్‌స్టార్ డ్యూయల్ షేడ్స్‌లో కనిపించారు. ఆ మూవీలో రెట్రో లుక్‌లో కనిపించిన పవన్.. ఫ్యాన్స్‌ని అలరించారు. సెకండ్ క్యారెక్టర్‌ని న్యూ కలర్‌తో చూపించి డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ కూడా శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు పవన్‌తో అటువంటి ఎక్స్‌పరిమెంట్‌కే రెడీ అయిన గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఇంకెంత మేజిక్ చేస్తారో చూడాలి..! పైగా.. ఒక క్యారెక్టర్ నుంచి డిఫరెంట్ వేరియేషన్స్‌ని తీసుకోవడంలో ఆయన తోపు అన్న పేరుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read :
కరోనా కాటు : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి, విషాదంలో పార్టీ శ్రేణులు
పేదలకు నాణ్యమైన వైద్యం : ఏపీలో 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్‌ల ఏర్పాటుకు ఉత్తర్వులు