రోష్ని భూకుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి.. భూకబ్జాతో ఇల్లు, కార్యాలయ నిర్మాణం.. త్వరలో విచారణ జరుపనున్న సీబీఐ..!

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎంలు- ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా ఓ భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. దాదాపు రూ.25వేల కోట్ల భూకబ్జా కేసులో వీరికి ప్రమేయముందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

రోష్ని భూకుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి.. భూకబ్జాతో ఇల్లు, కార్యాలయ నిర్మాణం.. త్వరలో విచారణ జరుపనున్న సీబీఐ..!
Balaraju Goud

|

Nov 25, 2020 | 10:55 AM

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎంలు- ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా ఓ భూకబ్జా కేసులో ఇరుక్కున్నారు. దాదాపు రూ.25వేల కోట్ల భూకబ్జా కేసులో వీరికి ప్రమేయముందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధగా భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నట్లు కశ్మీర్ అధికారులు తేల్చారు. అధికారులు రూపొందించిన జాబితాలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా పేర్లను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం చేర్చింది.ఈ స్కాంతో సంబంధమున్న వారికి సంబంధించిన వివరాలతో కశ్మీర్‌ అధికార యంత్రాంగం మంగళవారంనాడు ఓ జాబితా విడుదల చేసింది. జాబితాలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, కాంగ్రె్‌సలకు చెందిన నేతల పేర్లున్నాయి. ఈ కేసుకు సంబంధించి త్వరలో అబ్దుల్లాలను, ఇతరులను సీబీఐ ప్రశ్నించనుంది.

2000వ సంవత్సరంలో రోష్నీ చట్టం పేరిట అప్పటి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. 2001లో అసెంబ్లీ దానికి ఆమోదముద్ర వేసింది. వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను విక్రయించి సుమారు రూ25వేల కోట్లు సమీకరించి వాటిని ఓ జలవిద్యుత్‌ కేంద్ర ఏర్పాటుకు వినియోగించాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ వెసులుబాటును అసరాగా చేసుకున్న ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తూట్లు పొడిచారు. అప్పన్నంగా ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఆ చట్ట నిబంధనలు పదేపదే సరళీకరించి ఆ భూముల కబ్జాకు ఆస్కారమిచ్చాయి. అయితే, ప్రభుత్వ భూముల అమ్మకాల ద్వారా మొత్తం 25వేల కోట్లు రాబట్టాలని అంచనా వేసింది. కాగా పద్నాలుగేళ్లలో ప్రభుత్వ ఖజానాకు వచ్చిన సొమ్ము కేవలం రూ.76 కోట్లు మాత్రమేనని 2014నాటి కాగ్‌ నివేదికలో వెల్లడైంది.

భూ కబ్జా కేసులో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, బ్యూరోక్రాట్లు, న్యాయాధికారులు, పరపతి ఉన్న ప్రతి ఒక్కరూ రోష్నీ స్కీంను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫరూక్‌ ఇల్లు, ఎన్‌సీ కార్యాలయాలు కూడా కబ్జా భూమి అని అధికారులు నిర్ధారించారు. ఆనాడు రూ.10కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న భూమిని అబ్దుల్లాలు కారుచౌకగా పొంది, విలాసవంతమైన భవంతిని నిర్మి్ంచుకున్నట్కలు అధికారులు తేల్చారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు రావడంతో రోష్నీ చట్టాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది.భూఅక్రమణలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సీబీఐని ఆదేశించిందిహైకోర్ట్. దీంతో రోష్నీ పథకంలో అక్రమాలపై సీబీఐ మూడు వేర్వేరు కేసులు నమోదు చేసింది. అయితే, కశ్మీర్ జిల్లా అభివృద్ది మండలి (డీడీసీ) ఎన్నికలు జరగడానికి 24 గంటల ముందు ఫరూక్‌, ఒమర్‌ తదితరుల పేర్లను బయటికి తేవడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగును పులుముకొంది. ఇది దేశంలోనే అతి పెద్ద భూకుంభకోణమని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. అటు, ఒమర్‌ అబ్దుల్లా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ఫరూక్‌ తన ఇంటిని 1990లోనే నిర్మించుకున్నారని ఆనాడు పనిచేసిన కొందరు అధికారులు తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu