పవన్ కళ్యాణ్.. ఈ పేరులోని వైబ్రేషన్స్‌కు తెలుగు రాష్ట్రాలు షేక్ అవుతాయి. హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నటుడు. రీల్‌లోనే కాదు రియల్‌లో కూడా పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడిచేవారు కోకొల్లలు. చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత పవర్ స్టార్‌గా తన సామ్రాజాన్ని స్థాపించుకుని.. బాక్స్ ఆఫీస్ బాద్షాగా నిలిచారు. ఇటీవల సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన ఆయన జనసేనానిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. ట్విట్టర్‌లో రికార్డులు క్రియేట్ చేయడానికి పవన్ ఫ్యాన్స్ మొన్న సాయంత్రం నుంచి ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఫ్యాన్స్ బేస్ భారీ స్థాయికి చేరడంతో కేవలం 24 గంటల్లోనే ట్వీట్ల సంఖ్య 10.5 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఇండియాలో ఇప్పటివరకు అతిపెద్ద బర్త్‌డే ట్రెండ్ రికార్డు పవన్ కళ్యాణ్ పేరిట నమోదైంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ చరిష్మా సినిమాలు చేయకపోయినా ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా జనసేనాని రాజకీయాల్లో ఉన్నా.. సినిమాల్లో ఉన్నా ఆయన పవర్‌కు రికార్డులు బ్రేక్ కావాల్సిందే.
#Happy Birthday Pawan kalyan pic.twitter.com/F5G2K3Dsxf
— Nanabala Thulasiram (@NanabalaThulasi) September 2, 2019