జగనే టార్గెట్‌గా పవన్.. దేనికి సంకేతం.?

|

Dec 05, 2019 | 11:20 AM

పవన్ కళ్యాణ్… ఇప్పుడు ఈ పేరు ఏపీ రాజకీయాల్లో మారుమ్రోగుతోంది. రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన తెలుగు భాష, హిందుత్వం, కులం అంశాలపై చేసిన కామెంట్స్ రాజకీయంగా హీట్‌ను పెంచాయి. సర్కారీ బడుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సందర్భం నుంచి పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా జగన్ […]

జగనే టార్గెట్‌గా పవన్.. దేనికి సంకేతం.?
Follow us on

పవన్ కళ్యాణ్… ఇప్పుడు ఈ పేరు ఏపీ రాజకీయాల్లో మారుమ్రోగుతోంది. రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయన తెలుగు భాష, హిందుత్వం, కులం అంశాలపై చేసిన కామెంట్స్ రాజకీయంగా హీట్‌ను పెంచాయి.

సర్కారీ బడుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సందర్భం నుంచి పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. అంతేకాకుండా జగన్ మోహన్ రెడ్డి గారూ.. మీరు మతం మారాక కులాన్ని వదిలేయండని కూడా పవన్ సవాల్ విసిరారు. ఇటీవల పవన్ చేసిన ఈ కామెంట్స్ ఆయన్ని రాజకీయ నాయకుడి కంటే.. బీజేపీకి మద్దతుదారుడిగా వ్యవహరిస్తున్నారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్.. తన విధానాల కంటే ఎక్కువగా కార్యకర్తల కొరత, పార్టీని నడిపించే సరైన నాయకులు లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పొచ్చు. ఈ అంశాలపై దృష్టి సారించడం అటుంచితే.. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఆయన పేరే కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. పవన్ ప్రస్తుతం జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి చేరేలా సరైన రాజకీయ వ్యహకర్తలను నియమించాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు అంటున్నారు. అది గనక జరగకపోతే.. ఆయన ప్రసంగాలు వట్టి ట్వీట్లు, ట్రెండింగ్ వీడియోలు మాదిరిగానే మిగిలిపోతాయి తప్పితే.. ఓట్లుగా మారవని వారి భావన. అయితే పవన్ మాత్రం ప్రతీసారి తాను ఓట్ల కోసం రాజకీయాల్లోకి రాలేదని అంటారు. ప్రశ్నించేతత్త్వం పెరగాలన్న పవన్ కళ్యాణ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశారని చెప్పాలి.