Vakeel Saab : పొంగల్ రేస్‌లో పవన్ ఉన్నట్లేనా..? అభిమానులకు నిరాశ తప్పదా..?

|

Nov 12, 2020 | 9:29 PM

పాలిటిక్స్ కోసం బ్రేక్ తీసుకున్న పవన్‌ కళ్యాణ్ వకీల్ సాబ్‌గా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. లాక్ డౌన్‌తో బ్రేక్ పడిన ఈ సినిమాను ఈ మధ్యే రీస్టార్ట్ చేశారు పవన్‌.

Vakeel Saab : పొంగల్ రేస్‌లో పవన్ ఉన్నట్లేనా..? అభిమానులకు నిరాశ తప్పదా..?
vakeel saab first review:
Follow us on

పాలిటిక్స్ కోసం బ్రేక్ తీసుకున్న పవన్‌ కళ్యాణ్ వకీల్ సాబ్‌గా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. లాక్ డౌన్‌తో బ్రేక్ పడిన ఈ సినిమాను ఈ మధ్యే రీస్టార్ట్ చేశారు పవన్‌. దీంతో ఈ మూవీ నుంచి త్వరలోనే అప్‌డేట్ వస్తుందని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇంతవరకు మోషన్‌ పోస్టర్‌ తప్ప మరో అప్‌డేట్ లేకపోవటంతో దీపావళికి టీజర్‌ అయినా వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్‌ కనిపించటం లేదు. షూటింగ్ స్పీడుగా జరుగుతున్నా.. వకీల్ సాబ్ యూనిట్‌లో అప్‌డేట్ ఇచ్చే మూడ్‌ మాత్రం కనిపించటం లేదు. ఇంత వరకు అలాంటి అనౌన్స్‌మెంట్‌ కూడా ఏది ఇవ్వలేదు చిత్రయూనిట్. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తయినా ప్రమోషన్‌ మాత్రం స్టార్ట్ చేయటం లేదు.

సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉంటుందని చెబుతున్నా.. నిర్మాతలు మాత్రం అఫీషియల్‌గా కమిట్ అవ్వలేదు. దీనికి తోడు అప్‌డేట్స్ కూడా ఏమి రాకపోవటంతో అనుకున్నట్టుగా సంక్రాంతికి వకీల్ సాబ్‌ రిలీజ్ అవుతుందా..? లేదా…? అన్న డౌట్స్‌ రెయిజ్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా పవన్‌ టీం నుంచి అప్‌డేట్‌ వస్తుందేమో చూడాలి.

Also Read :

Alert : ఏపీకి భారీ వర్ష సూచన, ముఖ్యంగా ఆ జిల్లాలకు

పెరిగిన చలి, కరోనాతో తస్మాత్ జాగ్రత్త !

నెల్లూరు జిల్లాలో కల్తీ పాలు, తాగితే అంతే !