బేగంపేట్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో తల్లిదండ్రుల నిరసన!

| Edited By:

Jan 21, 2020 | 8:01 PM

మంగళవారం ఉదయం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని హెచ్‌పిఎస్ యాజమాన్యం ప్రకటించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రవేశం కోరుతూ పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో, పాఠశాల ప్రిన్సిపాల్..  నూతన విద్యా సంవత్సరానికి సీట్లు అయిపోయాయని, అడ్మిషన్లు దొరకవని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. […]

బేగంపేట్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో తల్లిదండ్రుల నిరసన!
Follow us on

మంగళవారం ఉదయం బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని హెచ్‌పిఎస్ యాజమాన్యం ప్రకటించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రవేశం కోరుతూ పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకున్నారు.

ఈ క్రమంలో, పాఠశాల ప్రిన్సిపాల్..  నూతన విద్యా సంవత్సరానికి సీట్లు అయిపోయాయని, అడ్మిషన్లు దొరకవని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు నిరసన చేపట్టారు. హెచ్‌పిఎస్ యాజమాన్యం బ్యాక్‌డోర్ ద్వారా సీట్లను విక్రయించి, మధ్యతరగతి, పేద విద్యార్థులకు ప్రవేశాలను నిరాకరించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.