AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాతోనే సరిపెట్టారా? అధికారుల వైఖరిపై విమర్శలు!

హైదరాబాద్‌లోని ప్రముఖ పారడైజ్ రెస్టారెంట్ భవనం బయట గోడలను, ముందు భాగాన్ని తాగునీటితో కడుగుతూ నీటిని తీవ్రంగా వృథా చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన జలమండలి అధికారులు రెస్టారెంట్‌కు రూ. 20 వేల జరిమానా విధించారు. అయితే, గతంలో నీటిని వృథా చేసిన కొన్ని పబ్బుల నీటి కనెక్షన్లను ఏకంగా తొలగించిన అధికారులు, పారడైజ్ విషయంలో మాత్రం కేవలం జరిమానాతో సరిపెట్టడంపై నగరవాసులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాతోనే సరిపెట్టారా? అధికారుల వైఖరిపై విమర్శలు!
Paradise Restaurant Water Wastage
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 27, 2026 | 9:46 AM

Share

హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రతీ నీటి చుక్కను కాపాడాలని ప్రభుత్వం, అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, నగరంలోని ప్రముఖ పారడైజ్ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం తాగునీటిని బిల్డింగులు, ఇళ్లముందు కడిగేందుకు వాడుతూ విపరీతంగా నీటిని వృథా చేసిన ఘటన ప్రస్తుతం భాగ్యనగరంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

అయితే, అధికారుల ఈ చర్యపై నగరవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని కొన్ని పబ్బులు నీటిని వృథా చేశాయనే కారణంతో జలమండలి అధికారులు ఏకంగా వాటి నీటి సరఫరా కనెక్షన్లను కట్ చేశారు. కానీ, పారడైజ్ రెస్టారెంట్ విషయంలో మాత్రం కేవలం రూ. 20 వేల చిన్న జరిమానాతో సరిపెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు, వ్యాపార సంస్థలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంతటి భారీ నీటి వృథాకు పాల్పడిన సంస్థకు రూ. 20 వేల జరిమానా విధిస్తే సరిపోతుందా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్వల్ప శిక్షలతో భవిష్యత్తులో ఇతర సంస్థలు నీటి వృథాను అరికడతాయా అనేది సందేహాస్పదమే.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అధికారులు ఎలాంటి పక్షపాతం లేకుండా, చట్టం ముందు అందరూ సమానులే అనే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే ప్రభుత్వ హెచ్చరికలకు విలువ ఉంటుంది. నీటి ప్రతి చుక్కను కాపాడాలని చెబుతున్న అధికారులు.. పారడైజ్ రెస్టారెంట్ విషయంలో తీసుకున్న ఈ ద్వంద్వ వైఖరిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
37 ఏళ్ల వయసులో హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త చరిత్ర
37 ఏళ్ల వయసులో హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త చరిత్ర
స్టేజ్‌పై ధనరాజ్‌ను కొట్టినంత పని చేసిన మంచు మనోజ్..
స్టేజ్‌పై ధనరాజ్‌ను కొట్టినంత పని చేసిన మంచు మనోజ్..
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?
పారడైజ్ రెస్టారెంట్‌లో నీటి వృథా.. రూ. 20 వేల జరిమానాపై విమర్శలు?
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..
ఒక్క పరుగు కొంపముంచిందా?
ఒక్క పరుగు కొంపముంచిందా?
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
కిచెన్, బాత్‌రూమ్ సింక్‌లో నీళ్లు నెమ్మదిగా పోతున్నాయా? కారణమిదే!
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!