స్థానిక సంస్థల ఎన్నికల వేళ…జగన్ సర్కార్ బంపరాఫర్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలన్నీ తమతమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్‌తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్దమైంది. రెండు ఫేజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి నెల 27, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే […]

స్థానిక సంస్థల ఎన్నికల వేళ...జగన్ సర్కార్ బంపరాఫర్..!
Follow us

|

Updated on: Mar 09, 2020 | 10:25 AM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజకీయ పార్టీలన్నీ తమతమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్‌తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్దమైంది. రెండు ఫేజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మార్చి నెల 27, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆయా గ్రామాలకు భారీ ప్రోత్సాహకాలు అందించనుంది ప్రభుత్వం.

ఏకగ్రీవమైన పంచాయితీ గ్రామ జనాభా బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదును అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్‌‌శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మరో రెండు రోజుల్లో దీనిపై జీవో విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. పంచాయతీ ఎలక్షన్స్ రాజకీయ పార్టీల గుర్తులతో కాకుండా పార్టీ రహితంగా జరుగునున్నాయి. అందుకే సర్కార్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. గ్రామాల్లో వైరుద్య వాతావరణం లేకుండా, ప్రజలంతా అభివృద్దిలో భాగం కావాలనే ప్రభుత్వాలు ఈ తరహా ప్రోత్సాహకాలను అందిస్తూ ఉండటం అనవాయితీగా వస్తోంది.