
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ అగ్రరాజ్యంలో మృత్యుహేల కొనసాగిస్తోంది. మరోవైపు.. అమెరికా వైపు వెళ్తున్న సుమారు 1,700 మంది అక్రమ వలసదారులను గుర్తించిన పనామా అధికారులు కరోనావైరస్ కారణంగా వారిని అడవిలో ఏర్పాటు చేసిన ఒక శిబిరంలో ఉంచారు. కొలంబియన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న లా పెనిటాలో వలసదారులను ఉంచామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ సుమారు 200 మందికి వసతి సౌకర్యాలు కల్పించామని వారు తెలిపారు.
కరోనా కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కాగా.. ఈ శిబిరంలోని 17 మందికి కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు వారిని వెంటనే వేరే చోటికి తరలించారు. మిగతా వారిని క్వారంటైన్‌లో ఉంచారు. ఇక్కడి స్థానిక పోలీస్ ఆఫీసర్ ఒకరు ఇటీవల కరోనా వల్ల చనిపోవడంతో అప్రమత్తమైన రెడ్‌క్రాస్ సిబ్బంది ఈ ప్రాంతాన్ని క్వారంటైన్ చేసింది.ద్ధ్య సిబ్బంది, పోలీసులు, నర్సులు తదితరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. వీరంతా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.