పాలకుర్తి తహసిల్దార్ రాజమణిపై సస్పెన్షన్ వేటు.. విధుల నుంచి తప్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

అక్రమాలకు పాల్పడ్డ మరో అవినీతి అధికారిపై వేటు పడింది. పాలకుర్తి తహసిల్దార్ బి.రాజమణిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఇంచార్జి కలెక్టర్ భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు.

పాలకుర్తి తహసిల్దార్ రాజమణిపై సస్పెన్షన్ వేటు.. విధుల నుంచి తప్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

Updated on: Dec 19, 2020 | 7:23 PM

అక్రమాలకు పాల్పడ్డ మరో అవినీతి అధికారిపై వేటు పడింది. పాలకుర్తి తహసిల్దార్ బి.రాజమణిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఇంచార్జి కలెక్టర్ భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని పాలకుర్తి గ్రామంలో ప్రభుత్వ భూమిని ఇతరుల పేరు మీద రిజిష్ట్రార్ చేసినందుకు పాలకుర్తి మండల తహసిల్దార్‌ బి.రాజమణిని విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పాలకుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 535 లో గల భూమి రికార్డుల ప్రకారం 2018 19 మరియు 2019 20 సంవత్సరాలలో ప్రభుత్వ పోరంబోకు స్థలంగా ఉంది. మండలానికి సంబంధించి భూముల వివరాలు ఫారం 1 లో సమర్పించే సమయంలో సదరు భూమిని తహసిల్దార్ నమోదు చేయలేదు. పైగా జిల్లా ఉన్నతాధికారుల నుంచి గాని, శాఖాపరంగా ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండానే సదరు భూమిని ఇతరులకు కేటాయించారు. మూడు సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసి మాదాసు శంకరయ్య, మాదాసు రాజయ్య, మాదాసు మల్లేశం పేర్ల మీద పట్టా చేసి సదరు భూములను ఆన్ లైన్ పహానిలో చేర్చారు. ప్రభుత్వ పోరంబోకు భూమి 4 ఎకరాల స్థలం ప్రైవేట్ వ్యక్తుల పేరుమీదుగా నమోదుచేయ‌డంపై చ‌ర్య‌లు తీసుకుంటూ త‌హ‌సిల్దార్‌ను స‌స్పెండ్ చేస్తున్నట్లు జనగామ జిల్లా ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us