ఒంటరైన పాక్.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇమ్రాన్‌ఖాన్

| Edited By:

Sep 26, 2019 | 10:21 AM

కశ్మీర్ విషయంలో పాక్ ఒంటరిగా మిగిలిపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు అనేక సందర్భాల్లో భారత్‌ను దోషిగా నిలపాలని చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టడంతో పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది. దీంతో ఈ సమస్యపై ముందుకు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు. యూఎన్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా ఇమ్రాన్ తన నిరాశను బయటపెట్టుకున్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించలేదని, […]

ఒంటరైన పాక్.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు: ఇమ్రాన్‌ఖాన్
Follow us on

కశ్మీర్ విషయంలో పాక్ ఒంటరిగా మిగిలిపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు అనేక సందర్భాల్లో భారత్‌ను దోషిగా నిలపాలని చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టడంతో పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది. దీంతో ఈ సమస్యపై ముందుకు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు. యూఎన్‌లో జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా ఇమ్రాన్ తన నిరాశను బయటపెట్టుకున్నారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా తమకు మద్దతు లభించలేదని, తమను ఎవరూ పట్టించుకోలేదని ఆయన భాధను వ్యక్తం చేశారు.

భారత్‌తో మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు తమకు మద్దతును ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటివరకు కశ్మీర్ విషయంలో ఎంతో ప్రయత్నించామని కానీ ఎవ్వరూ పట్టించుకోలేదని నిరాశను వ్యక్తం చేశారు పాక్ ప్రధాని. భారత్‌తో కశ్మీర్ విషయంలో యుద్ధం ఒక్కటే మిగిలిందని, అయితే యుద్ధం తమ అభిమతం కాదన్నారు.  తమకు ఎనిమిది మిలియన్ల యూరోపియన్లు, లేదా యూదులు, అమెరికన్లు ఒత్తిడి తెస్తే మా పరిస్థితి మరో విధంగా ఉండేదంటూ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో 9 లక్షల మంది భారత సైన్యం ఏంచేస్తుందో దేవునికే తెలియాలి… ఎందుకంటే అక్కడ ఆంక్షలు తొలగించిన తర్వాత పరిస్థితి సాధారణంగా ఉండాలి కానీ అలా లేదంటూ చెప్పుకొచ్చారు. భారత చర్యలను మీరు అంగీకరిస్తారా అంటూ ఇమ్రాన్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తికల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ అనేక విధాలుగా భారత్‌పై ఒత్తిడి తీసుకురాడానికి ప్రపంచ దేశాలన ఒక్కటిగా చేయాలకుంది. కానీ చైనా, అమెరిక వంటి దేశాలు కనీసం స్పందించలేదు. పైగా ఇది ఇరు దేశాల అంతర్గత సమస్యగా భావించి వెనకడుగు వేశాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మధ్యవర్తిత్వం చేస్తానంటూ ప్రకటించారు. అయితే దీనిపై భారత్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ప్రపంచ దేశాల ముందు భారత్ తన పదునైన వాణిని బలంగా వినిపించడంతో అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్‌కు అండగా నిలించింది.