పాకిస్తాన్ చెర నుంచి.. తెలుగు మత్స్యకారులు విడుదల!

| Edited By:

Jan 06, 2020 | 5:59 AM

సింధ్ ప్రావిన్స్‌లోని లాండి పట్టణం మాలిర్ జిల్లా జైలు నుంచి 20 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. గత ఏడాది కాలంగా జైలులో ఉన్న భారతీయ మత్స్యకారులను లాహోర్ నుండి తరలించి వాగా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగిస్తారు. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టారన్న నెపంతో వీరిని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా.. పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో కరాచీలోని మాలిర్, లాంధీ […]

పాకిస్తాన్ చెర నుంచి.. తెలుగు మత్స్యకారులు విడుదల!
Follow us on

సింధ్ ప్రావిన్స్‌లోని లాండి పట్టణం మాలిర్ జిల్లా జైలు నుంచి 20 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదివారం ఆదేశించింది. గత ఏడాది కాలంగా జైలులో ఉన్న భారతీయ మత్స్యకారులను లాహోర్ నుండి తరలించి వాగా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగిస్తారు.

పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టారన్న నెపంతో వీరిని పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా.. పాకిస్తాన్ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో కరాచీలోని మాలిర్, లాంధీ జైళ్ల నుంచి మూడు బ్యాచ్‌లలో 260 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు భారత మత్స్యకారులను పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఫోర్సెస్ గత ఏడాది ఆగస్టు నుండి 34 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసి, ఆరు పడవలను స్వాధీనం చేసుకున్నారు.