పాక్‌లో ఐఈడీ పేలుడు.. 16 మందికి పైగా గాయాలు..

| Edited By:

Jul 23, 2020 | 7:34 PM

పాకిస్థాన్‌లో ఐఈడీ బ్లాస్ట్ కలకలం రేపింది. పరచినార్ ప్రాంతంలోని తురి బజార్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 16 మందికి పైగా గాయపడ్డారు. మార్కెట్‌లోని ఓ కూరగాయల వాహనంలో ఐఈడీ బాంబును..

పాక్‌లో ఐఈడీ పేలుడు.. 16 మందికి పైగా గాయాలు..
Follow us on

పాకిస్థాన్‌లో ఐఈడీ బ్లాస్ట్ కలకలం రేపింది. పరచినార్ ప్రాంతంలోని తురి బజార్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 16 మందికి పైగా గాయపడ్డారు. మార్కెట్‌లోని ఓ కూరగాయల వాహనంలో ఐఈడీ బాంబును అమర్చి పేలుడుకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.