దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 17,296 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 407 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. ఇందులో 1,89,463 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,301 మంది కరోనాతో మరణించారు. అటు 2,85,637 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ […]

దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు..

Updated on: Jun 26, 2020 | 10:12 AM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 17,296 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 407 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. ఇందులో 1,89,463 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,301 మంది కరోనాతో మరణించారు. అటు 2,85,637 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 13,941‬ మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,47,741 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,931 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 73,780 కేసులు, 2,429 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 70,977 కేసులు నమోదు కాగా, 911 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సంభవించాయి.

Follow Us