AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 19 నుంచి ఓయూ పీజీ పరీక్షలు..

ఉస్మానియా యూనివర్సిటీ ఫైనల్ పరీక్షలకు తేదీ ఖరైంది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 19 నుంచి మొదలుకానున్నాయి.

ఈ నెల 19 నుంచి ఓయూ పీజీ పరీక్షలు..
Balaraju Goud
|

Updated on: Oct 08, 2020 | 6:22 AM

Share

ఉస్మానియా యూనివర్సిటీ ఫైనల్ పరీక్షలకు తేదీ ఖరైంది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 19 నుంచి మొదలుకానున్నాయి. ఇందుకోసం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను వర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వర్సిటీ హాస్టళ్లలోకి విద్యార్థుల అనుమతిపై అంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టళ్లలో చేరితే ప్రమాదం అని భావించిన అధికారులు.. ఇతరల విద్యార్థులు రావద్దని సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థలుు ఓయూలో చదువుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా హైదరాబాద్‌కు వచ్చి పరీక్షలు రాయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించేలా వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు తమకు అనుకూలమైన పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునేందుకు ఓయూ వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులో ఉంచారు. ఈ నెల 12వ తేదీ వరకు వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా వార ఎంపిక చేసుకున్న సెంటర్లలో పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Follow Us
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్