ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా వయిదా పడిన ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 27 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు

ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

Updated on: Oct 19, 2020 | 9:58 PM

OU PG Final Semester Exam : జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా వయిదా పడిన ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 27 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించేలా సవరించిన షెడ్యూలును ప్రకటించింది. పరీక్షలు నేటి నుంచి జరగాల్సినప్పటికీ.. వర్షాల కారణంగా వాయిదా పడ్డాయి.

మరోవైపు పీజీ ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీకి లేట్ ఫీజు లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు ఈ నెల 23 వరకు పొడిగించినట్లు కన్వీనర్ కిషన్ వెల్లడించారు. ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జేఎన్ టీయూహెచ్‌లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబరు 6న సీపీజీఈటీ జరగనుంది. లేట్ ఫీజు  రూ.500 చెల్లించి ఈనెల 29 వరకు, రూ.2 వేల లేట్ ఫీజుతో నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us