ISRO: ఇస్రో సంచలనం.. దేశ రక్షణ వ్యవస్థలో ‘గేమ్ చేంజర్’గా సరికొత్త EOS-05 ఉపగ్రహం!
ISRO: ఇక సముద్రంలో మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉంటుందో గుర్తించి మత్స్యకారులకు తెలిపే టెక్నాలజీ కూడా EOS 05 సొంతం. ఈ ఉపగ్రహం కేవలం భారత దేశం మాత్రమే కాదు దక్షిణాసియా మొత్తాన్ని గమనిస్తూ ఉంటుంది. భారత ఉపఖండం మొత్తం..

ఇస్రో తాజాగా అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టిన EOS 05 అనే ఉపగ్రహం దేశ రక్షణ వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలవబోతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఇస్రో ఈ ఏడాది కేవలం రెండే ప్రయోగాలు చేపట్టింది. తాజాగా ఇస్రో ప్రయోగించిన EOS 05 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. చేరిన కొద్ది క్షణాలలో తన పనిని కూడా మొదలు పెట్టింది. ఇప్పటివరకు (EOS) భూ పరిశీలన ఉపగ్రహాలు సూర్యానువర్తన కక్ష్యలో తిరుగుతూ ఉంటాయని EOS 05 ఉపగ్రహం మాత్రం భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. అంటే ఇప్పటి వరకు ఇస్రో అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహం ఎత్తు చాలా ఎక్కువ. ఒక్కో ఇమేజ్ విడ్త్ కనీసం 15 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. అందుకే ఇంత ఎత్తులో ప్రవేశ పెట్టింది ఇస్రో.
ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఇది చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన ఈ తరహా భూ పరిశీలన ఉపగ్రహాలు భూ దిగువ కక్ష్య, సూర్యానువర్తన కక్ష్యలో తిరుగుతూ ఒకసారి ఇమేజ్ ను క్యాప్చర్ చేస్తే మరో ఫోటో తీయాలంటే రోజుల వ్యవధి సమయం పడుతుంది. అలాగే పిక్సెల్ సైజు కూడా చాలా తక్కువ సైజులో ఉంటుంది.. EOS ఉపగ్రహం భూ స్థిర కక్ష్యలో ఉంటూ 42 మీటర్ల వ్యాసార్థం తో ఫోటోలు తీయగలదు. అది కూడా హై రెజల్యూషన్ ఇమేజెస్ ను క్యాప్చర్ చేయగల సామర్థ్యంతో పాటు ప్రతి పది నిముషాలకు ఒక పోటో తీయగలదు. అలాగే విపత్తులు, తుఫాను లాంటి వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టగలదు.
ఇక సముద్రంలో మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉంటుందో గుర్తించి మత్స్యకారులకు తెలిపే టెక్నాలజీ కూడా EOS 05 సొంతం. ఈ ఉపగ్రహం కేవలం భారత దేశం మాత్రమే కాదు దక్షిణాసియా మొత్తాన్ని గమనిస్తూ ఉంటుంది. భారత ఉపఖండం మొత్తం 10 నిముషాలకు ఓ సారి చిత్రాలు తీసి పంపగలరు. పంటలు, నీటి వనరులు, కాలుష్యం ఇంకా అనేక అంశాల్లో మానవాళికి ఉపయోగకరంగా ఉండబోతోంది EOS 05 ఉపగ్రహం. ప్రపంచం లో ఇంతటి సామర్థ్యం గల ఉపగ్రహాల్లో ఇదే మొదటిది. ఇస్రో వద్ద ఉన్న ఉపగ్రహాలతో పోల్చితే 567 రెట్లు మెరుగైన భూ పరిశీలన ఉపగ్రహం ఈ EOS 05 ఉపగ్రహం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
