50% వీవీప్యాట్‌లు లెక్కించాలి- విపక్షాలు

|

Apr 15, 2019 | 8:44 AM

ఈవీఎంల ద్వారా ఎన్నికలు జిరిగితే..ప్రజలు ఎన్నికల పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని విపక్షాలు ఆరోపించాయి. ఆదివారం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశమై 50% వీవీప్యాట్‌ల లెక్కింపు కోసం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలుచేసే అంశంపై చర్చించిన నేతలు.. ఆ తర్వాత అక్కడే జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కనీసం 50% వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని వారు డిమాండు చేశారు. దేశంలో ఈనెల 11వ తేదీన జరిగిన తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని..ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు […]

50% వీవీప్యాట్‌లు లెక్కించాలి- విపక్షాలు
Follow us on

ఈవీఎంల ద్వారా ఎన్నికలు జిరిగితే..ప్రజలు ఎన్నికల పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని విపక్షాలు ఆరోపించాయి. ఆదివారం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో సమావేశమై 50% వీవీప్యాట్‌ల లెక్కింపు కోసం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలుచేసే అంశంపై చర్చించిన నేతలు.. ఆ తర్వాత అక్కడే జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కనీసం 50% వీవీప్యాట్‌లను లెక్కించాల్సిందేనని వారు డిమాండు చేశారు. దేశంలో ఈనెల 11వ తేదీన జరిగిన తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయని..ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయినప్పటికీ దేశవ్యాప్తంగా పారదర్శక వ్యవస్థ తీసుకురావడం కోసమే తానీ పోరాటం మొదలుపెట్టినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈవీఎంల వల్ల వచ్చే సమస్యలను  దృష్టిలో ఉంచుకొని 50% వీవీప్యాట్‌లను లెక్కించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీ, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం నేత నీలోత్పల్‌ బసు, ఎస్పీ నేత సురేంద్రసింగ్‌ నాగర్‌, జేడీఎస్‌ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.  కాగా ఎన్నికల కారణంగా ఈ భేటీకి కొన్ని పార్టీల నేతలే హాజరైనప్పటికీ తమ డిమాండుకు మొత్తం 23 పార్టీలు మద్దతిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.