గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో.. విపక్షాలపై రామ్ మాధవ్ ఫైర్..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు ఇండో-చైనా బోర్డర్ లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలపై ప్రధాన విపక్ష పార్టీ చేస్తున్న ప్రకటనలు దురదృష్టకరమని బీజేపీ నేత రామ్ మాధవ్

గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో.. విపక్షాలపై రామ్ మాధవ్ ఫైర్..

Edited By:

Updated on: Jun 18, 2020 | 3:44 PM

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు ఇండో-చైనా బోర్డర్ లో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలపై ప్రధాన విపక్ష పార్టీ చేస్తున్న ప్రకటనలు దురదృష్టకరమని బీజేపీ నేత రామ్ మాధవ్ అన్నారు. ఈ ప్రకటనలు దేశ శత్రువులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని మండిపడ్డారు.
‘విపక్షాల ప్రవర్తన చాలా దురదృష్టకరం. యావద్దేశం సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంటే, దేశ శత్రువులకు లబ్ధి చేకూర్చేలా విపక్ష పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి. రాహుల్ గాంధీ చేస్తున్న ప్రకటనలను ఆధారంగా చేసుకుని వారు విమర్శలు చేస్తున్నారు’ అని రామ్ మాధవ్ అన్నారు.

లదాఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోతే వారికి సంతాపం తెలిపేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు రెండు రోజులు ఎందుకు పట్టిందంటూ రాహుల్ గాంధీ బుధవారంనాడు నిలదీశారు. అయితే ప్రధాని మోదీ మాత్రం భారతదేశం శాంతినే కోరుకుంటుందని, ఎవరైనా రెచ్చగొడితే దీటుగా సమాధానమిస్తుందని చైనాకు పరోక్షంగా గట్టి సందేశమే ఇచ్చారు. గాల్వాన్ లోయలో బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో భారతదేశానికి చెందిన ఒక కల్నల్ ర్యాంకు అధికారి సహా 20 మంది సైనికులు వీరమరణం పొందారు.

Loading...
Unable to load recommendations.
Follow Us