ఆ పార్టీ అంటే ఇష్టం.. అందులో తప్పకుండా జాయిన్ అవుతా: ట్వింకిల్ ఖన్నా

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకతీతంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో మోదీ తన గురించిన పలు ఆసక్తికర విషయాలను అక్షయ్‌తో పంచుకున్నారు. కాగా ఈ ఇంటర్వ్యూ తరువాత అక్షయ్, ట్వింకిల్ ఖన్నా రాజకీయాల్లో జాయిన్ అవుతారని, బీజేపీకి వారు మద్దతును తెలుపుతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో వాటిపై స్పందించిన ట్వింకిల్.. పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. నా సమాధానం వారికి ప్రచారం చేసినట్లు కాదు. […]

ఆ పార్టీ అంటే ఇష్టం.. అందులో తప్పకుండా జాయిన్ అవుతా: ట్వింకిల్ ఖన్నా

Edited By:

Updated on: Apr 27, 2019 | 3:47 PM

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకతీతంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో మోదీ తన గురించిన పలు ఆసక్తికర విషయాలను అక్షయ్‌తో పంచుకున్నారు. కాగా ఈ ఇంటర్వ్యూ తరువాత అక్షయ్, ట్వింకిల్ ఖన్నా రాజకీయాల్లో జాయిన్ అవుతారని, బీజేపీకి వారు మద్దతును తెలుపుతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి.

దీంతో వాటిపై స్పందించిన ట్వింకిల్.. పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. నా సమాధానం వారికి ప్రచారం చేసినట్లు కాదు. ఈ క్షణంలో నేను వోడ్కా పార్టీలో జాయిన్ అయ్యి మరుసటి రోజుకు హ్యాంగోవర్ అయ్యేలా తాగాలని ఉంది అంటూ కామెంట్ పెట్టారు.